చింతాకుపాలెంలో రామన్న, జ్యోతి అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ బతికేవాళ్లు.
కొన్ని రోజులయిన తర్వాత జ్యోతికి పానం మంచిగా లేకుండా అయింది.
జ్యోతికి వైద్దెం చేయించాలంటే తాను వరి పండించి డబ్బులు సంపాదించాలని రామన్న అనుకున్నాడు.
రామన్న పొద్దుగాల లేచి, నాగలి పట్టుకొని పొలానికి పోయి, దుక్కి దున్ని, గట్లు చేకి, జంబుకోటి వడ్లు వేశాడు.
కొన్ని రోజులయిన తర్వాత నారు మొలిచింది. నారుకు మంచిగా నీరుపెట్టాడు రామన్న.
కొన్ని రోజులయిన తర్వాత నారు పెద్దగా అయింది. రామన్న నారు పీకి నాట్లువేశాడు.
కొన్ని రోజులయిన తర్వాత కలుపు తీసాడు రామన్న.
కొన్ని రోజులయిన తర్వాత వరి పంటకు జల్లులు వచ్చాయి. రామన్న వరిని కోసి తూరుపార పట్టాడు. దుమ్ము, ధూళి, చెత్తా, చెదారం అంతా కొట్టుక పోయింది.
రామన్న వడ్లని ఎడ్లబండిలో ఇంటికి తీసుకొచ్చి, కొన్నింటిని అమ్మాడు.
అమ్మగా వచ్చిన డబ్బులతో తన భార్య జ్యోతికి మంచి వైద్దెం చేయించాడు.
మిగిలిన కొన్ని వడ్లని పట్టించి ఇంటికి తెచ్చాడు.
కొన్ని రోజులయిన తర్వాత రామన్నకు కొడుకు పుట్టాడు. ఆ తర్వాత రామన్న జ్యోతిలు తమ కొడ్కుతో హాయిగా జీవించారు.