మంచి మార్గం చూపేవారు
కష్టాల్లో కాపాడేవారు
ప్రేమతో నన్ను పిలిచేవారు
నేస్తాలు! నా నేస్తాలు!!

ఆట పాటలలో అలగనివారు
కమ్మని కబుర్లు చెప్పేవారు
కలకాలం కలిసుండేవారు
నేస్తాలు!‌నా నేస్తాలు!!

హెచ్చు తగ్గులు ఎంచనివారు
సమతా మమతా పంచేవారు
సౌజన్యాన్ని పెంచేవారు
ఎల్లవేళలా కాచేవారు
నేస్తాలు! నా నేస్తాలు!!