అనగనగా ఆఫ్రికా లో ఒక ఊరు.ఆ ఊరు పేరు జోన్ . జోన్ చాలా అందమైన ఊరు.ఆ ఊరి ప్రజలంతా ఎంతో ఐకమత్యంగా కలిసి మెలిసి ఉండేవాళ్ళు . ఏ చిన్న పండుగ వచ్చినా వాళ్లంతా ఎంతో సంతోషంగా జరుపుకునేవాళ్ళు.

ఆ ఊళ్ళోనే "కీరో" అని ఒక అబ్బాయి ఉండేవాడు. కీరో ఎంతో మంచివాడు. పొలం పనుల్లోనూ, ఇంటి పనుల్లోనూ తను వాళ్ళ అమ్మానాన్నలకు ఎంతో సహాయం చేసేవాడు. అవసరాల్లో ఉన్న వారికి సాయపడటమంటే కీరోకి ఎంతో ఇష్టం.

ఒక సారి కీరో తమ పొలానికి వెళ్ళాడు. పొలం గట్టుమీద గ్రద్ద ఒకటి ఓ కుందేలును చంపేందుకు ప్రయత్నిస్తోంది. వెంటనే ఆ గ్రద్దపైకి రాళ్ళు విసరడం మొదలుపెట్టాడు కీరో. కానీ ఆ గ్రద్ద కుందేలును విడవకుండా, దాన్ని పొడుస్తూనే ఉంది.

"ఇలాకాద"ని, కీరో ఆ గ్రద్దదగ్గరకు వెళ్ళి దాన్ని తోలడం మొదలుపెట్టాడు. కానీ, ఆ గ్రద్ద కీరోపైకి తిరగబడి, వాడివీపుమీద పొడవటం మొదలుపెట్టింది.

అప్పుడు కీరో మొదట -కుందేలుని తన దగ్గరకు తీసుకొని, దాన్ని తన షర్టులో దాచాడు. అటుపైన గ్రద్దను గట్టిగా తరిమి వెళ్ళగొట్టాడు. గాయపడ్ద కుందేలును తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు తన దగ్గర ఏడు కుందేళ్ళు ఉన్నాయి!

ఇదివరకే తను ఆరు కుందేళ్లను, మూడు పావురాలను, ఒక కుక్కను, నాలుగు పిల్లులను ప్రాణాపాయ స్థితినుంచి కాపాడి పెంచుతున్నాడు. వాటిని పెంచడంలో కీరోకి వాళ్ళ అమ్మానాన్నలు, ఆ ఊరిజనాలు అందరూ సాయపడేవారు.

కాలం గడిచేకొద్దీ, కీరో దగ్గరచేరే జంతువుల సంఖ్య పెరగసాగింది. వాటన్నింటినీ సంబాలించడం కోసమని ఊరంతాకలిసి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటుచేద్దామనుకున్నారు. అనుకున్నట్టుగానే, వారంతా కలిసి చందాలు వేసుకుని, కాపాడబడే

జంతువులకోసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటుచేశారు.ఆ తర్వాత ఆ స్థలానికి చాలా జంతువులు బయటినుండి కూడా రావటం మొదలుపెట్టాయి. అవన్నీ కలసి అక్కడ ఆడుతూ పాడుతూ ఎంతో హాయిగా గడిపేవి. అలా మొదలైందన్నమాట- మొట్టమొదటి "జూ