చిన్న చిన్న పిల్లలం
మల్లె పూల మొగ్గలం
మల్లెపూల మొగ్గలం
రంగు రంగుల ముగ్గులం
ప్రకృతి అందాలు చూద్దమా
పరవశించి గంతులేద్దమా
"చిన్న చిన్న"





స్వాతి వాన చినుకుల్లో
మనము ఒక చినుకౌదాం
సీతాకోక చిలుకల్లో
మనము ఒక చిలుకౌదాం
సిరివెన్నెల చంద్రులౌదమా
వెన్నెల్లో సంద్రమౌదమా
"చిన్న చిన్న"



జామ చెట్ల తోటలోన
రామ చిలుక మనమౌదాం
జాజిపూల చెట్టుకింద
బావి గిలక మనమౌదాం
నిమ్మపూల వాసనౌదమా
నింగిలోన మేఘమౌదమా
"చిన్న చిన్న"



కృష్ణానదిని చుట్టుముట్టు
దట్టమైన అడవౌదాం
గోదావరి నది ఒడిలో
పాడుతున్న పడవౌదాం
మనఊరి చెరువౌదమా
చెరువులోని చేపౌదమా
"చిన్న చిన్న"