ఉగాది అంటే నాకు గుర్తొస్తాయి
అమ్మ చేసిన ఉగాది పచ్చడి
బామ్మ చేసిన పిండి వంటలు-
తల్చుకుంటే నోరూరుతుంది.

ఇల్లంతా అలంకరణ
ఇంటిముందు రంగవల్లులు
మనసుకి అహ్లాదాన్ని కలిగిస్తాయి



పెద్దలు చేసే పూజలు
పిల్లలు ఆడే ఆటలు, పాడే పాటలు
సముద్రమంత ఆనందాన్ని
కలిగిస్తాయి

ఇల్లంతా చుట్టాలు
తాతయ్య పలకరింపులు
ఇవ్వన్నీ చూస్తే అనిపిస్తుంది -

ఉగాది మళ్ళీ మళ్ళీ రావాలని !