తాజ్ మహల్ ఎక్కడ ఉంది?
జవాబు: కట్టిన చోటే!చలికాలంలో ఐ స్ క్రీం తింటే ఏమవుతుంది?
జవాబు: కప్పు ఖాళీ అవుతుంది.
రెండు మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి?
జవాబు: రసం తీసి!గుడికి వెళ్ళినప్పుడు బొట్టుదేనికి పెట్టుకుంటారు?
జవాబు: నుదుటికి!బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు?
జవాబు: పట్టినంత మంది!ఆఫ్రికా గిరిజనులు అరటిపండు ఎలా తింటారు?
జవాబు: ఒలుచుకొనిహుసేన్ సాగర్ లో బుద్ధుడు ఒక చేతిని పైకి ఎత్తి ఉంటాడు ఎందుకు?
జవాబు: కింద నీరు పెరిగితే పైకి పోతారని చెప్పేందుకు!ఓ ఇంట్లో బోలెడు డబ్బు నగలున్నాయి. ఒక గజదొంగ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు కూడాను. అయినా అతను ఆ ఇంటిని దోచుకోలేదు ఎందుకు?
జవాబు: అది తన ఇల్లే కాబట్టి!ఆటలు ఆడని ప్లేయర్ ఏంటి?
జవాబు: సీడీ ప్లేయర్!డ్రైవర్ లేని బస్ ఏది ?
జవాబు: సిలబస్!నాలుకపైన పెట్టుకుంటారు గానీ మింగరు- ఏమిటది?
జవాబు: తపాలా బిళ్ళ!పంజరంలో ఏముంటుంది?
జవాబు: ఏదిపెడితే అదే!తోటలో పండిన మామిడి పండ్లు కోయడానికి సరైన కాలమేది?
జవాబు: తోతమాలి లేనికాలం!వాస్తు శాస్త్రిని బిచ్చగాడు ఏమడిగాడు?
జవాబు: 'ఏ చెట్టు కింద కాపురం మొదలు పెట్టమంటారు?' అని!"పాప" భీతి అంటే...?
జవాబు: 'పాప' అంటే భయపడటం!