భధ్రాపురంలో ఉండే భీమయ్య ఇప్పుడు చాలా ధనవంతుడు. అతను చిన్నగా ఉన్నప్పుడు పేదరికంతో అనేక కష్టాలు పడ్డాడు. కానీ రేయింబవళ్ళూ చలి-ఎండ-వాన అనకుండా బాగా కష్టపడి పనిచేయటంతో కొంతకాలానికి ఒక చిన్న పొలం కొనుక్కోగలిగాడు. కాలం కలిసి రావ డంతో ఇప్పుడు బాగా ధనవంతుడు కూడా అయ్యాడు.
అతను ఇంతకాలమూ ఉన్న ఇల్లు చాలాచిన్నది, పాతబడింది కూడాను. ఇప్పుడు క్రొత్తగా పెద్ద ఇల్లు ఒకటి కట్టించుకోవాలనిపించింది భీమయ్యకు. కొత్త ఇంటికోసం పనివాళ్ళకు పనులన్నీ పురమాయించాడు .
'కిటికీలు, తలుపులు, కుర్చీలు, మంచాలు తయారుచేయ్యడానికి సరియైన వడ్రంగి ఎవరా' అనేది మటుకు తేలలేదు.
దగ్గర్లోనే ముకుందాపురంలో వడ్రంగి పనిచేసేవాళ్ళు ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు భీమయ్య.
అక్కడ అతను సోమయ్య , రామయ్య , ఆత్మయ్య అనే ముగ్గురు వడ్రంగులనూ వేరువేరుగా కలిశాడు.
"నాకు ఒక తెడ్డుకట్టె, ఒక పప్పు గిత్తి , ఒక కవ్వము, ఒక లత్తినకట్టె , ఒక చపాతీలు ఒత్తే కట్టె చేసి పెడతారా?" అన్నాడు. అందుకోసం 2వారాల సమయంతోపాటు ముగ్గురికీ తలా కొంత సొమ్మునుకూడా ఇచ్చాడు.
మొదటివాడు ఆత్మయ్య నాలుగు వస్తువుల్నీ తయారుచేసుకుని వారం తిరక్కుండానే వచ్చాడు.
ఇచ్చిన సమయానికి 2రోజులు ముందుగానే పని పూర్తిచేసి వచ్చాడు రామయ్య.
సోమయ్య మరోరెండు వారాల సమయం అదనంగా తీసుకున్నాడు. ఆలస్యంగానైనా వస్తువులు తీసుకొచ్చాడు.
వాళ్ళు తెచ్చిన వస్తువులన్నిటినీ పరిశీలించాక, భీమయ్య క్రొత్త ఇంటి చెక్క పనినంతా రామయ్యకు అప్పగించాడు.
ఇదంతా గమనిస్తూన్న భీమయ్య కొడుకు అతన్ని అడిగాడు- 'ఇంటిపని అంతా రామయ్యకే ఎందుకు అప్పగించావు?' అని.
భీమయ్య నవ్వి, జవాబిచ్చాడు- "చూడు, ఆత్మయ్య ఖరీదైన చెక్కను వాడాడు. అందుకని పని సులభం అయ్యింది. కానీ అతనికి పనిలో నైపుణ్యం లేదు. అతను తయారు చేసిన వస్తువుల్లో అది కొట్టొచ్చినట్లు కనబడింది. ఇక సోమయ్యలో నైపుణ్యం ఉంది. కానీ అతను వాడిన చెక్క నాసిరకంది. అంతేకాదు; అతను మాట నిలుపుకోక, పనిలో చాలా ఆలస్యం కూడా చేశాడు. అయితే రామయ్య వాడింది పనికి తగిన చెక్క.
అంతే కాదు, అతని పనిలో నైపుణ్యం ఉంది. పనిని కూడా ఇచ్చిన గడువులో పూర్తి చేశాడు.- అర్థమైందా, పనికి అర్హత ఎవరికి