ఈ బొమ్మను చూడండి..
బొమ్మలో చిన్నారి చక్కగా తయారై ఎక్కడికో నడుచుకుంటూ పోతున్నది.
ఎక్కడికి పోతున్నదో, ఏమో?
ఇది అడవా, లేకపోతే మరి తోటా?
ఈ చిట్టిపాప ఒక్కతే వెళ్తున్నదేంటి?
ముఖం కనబడటంలేదు- మరి ఈ పాప సంతోషంగా ఉందో, లేకపోతే బాధ పడుతున్నదో తెలీటంలేదే!
ఏదో ఆలోచిస్తున్నదేమో! లేకపోతే బహుశ: ఏ కుందేలు వెనకో పోతున్నదేమో, చప్పుడు చేయకుండా!
కొంచెం శ్రద్ధగా మనసు పెట్టి చూశారంటే మీకు నిజంగా తెలిసిపోతుంది- ఈ పాప కథ. ఆ కథని మాకు రాసి పంపించెయ్యండి తొందరగా. బాగున్న కథని కొత్తపల్లిలో ప్రచురిద్దాం!