నగరానికి దూరంగా.. పల్లె వున్నది!

ఆ పల్లెటూరి గుండెల్లో పండగున్నది! (2)

చిట్టి మొగ్గ విచ్చినపుడు-

చేను విరగపండినపుడు

చక్కనైన పిట్టలన్నీ -

రెక్క విప్పి పాడినపుడు

పల్లెటూరి గుండెలో పండగున్నది.(2)

ఆలమంద ఉదయవేళ-

పాలధార కురియునపుడు

తోట చేల ఉన్న గున్న మావి-

తోరణాలు కట్టినపుడు

పల్లెటూరి గుండెలో పండగున్నది.(2)

కోదండ స్వామివారు కోవెలలో నిలచినపుడు

పొగమంచు అగరు వగరు-

పొదపొదపై ప్రాకినపుడు

పల్లెటూరి గుండెల్లో పండగున్నది. (2)

నగరానికి దూరంగా.. పల్లె వున్నది!

ఆ పల్లెటూరి గుండెల్లో పండగున్నది! (2)