ఈ బొమ్మ ను చూడండి. ఎవరు ఇది?
కూర గణపతి!
ఎవరో తయారు చేసి ఉంటారు కదూ, ఎందుకు చేశారో, కూరగాయలతో?
లేకపోతే గణపతే ఇలా వేషం వేసుకొని కూర్చున్నాడా?
మరి రంగు రంగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు దొరకలేదో..?
నిమజ్జనం చేసి జల కాలుష్యాన్ని పెంచటం కంటే ఇది నయమనుకున్నారేమో, మరి!
ఈ కూరగాయల్ని ఆవులు ఎంచక్కా భోంచేస్తాయి గదా, మరి ఆవులన్నీ కలిసి ఇలా చేసుకున్నాయా?
దీని వెనక ఏదో ఒక కథ ఉండే ఉంటుంది.. మీ ఊహకీ అందుతుందేమో ఆ కథ, ప్రయత్నించి చూడండి! మాకు రాసి పంపండి; బాగుంటే ప్రచురిస్తాం.