• కొడుకు డాక్టరవుతాడని తల్లిదండ్రులకు అనుమానం ఎప్పుడొస్తుంది?
  జవాబు: తోడబుట్టిన చెల్లెల్ని వాడు "సిస్టర్ , సిస్టర్" అని సంబోధిస్తున్నప్పుడు.
 • తెలుగు,తెలుగు కలుసుకుంటే మొదట ఏమొస్తుంది?!
  జవాబు: "గుడ్ మార్నింగ్"!!
 • హోటల్ కెళ్ళిన జడ్జిగారికి ఒళ్ళు మండేదెప్పుడు!?
  జవాబు:బేరర్ వచ్చి "ఆర్డర్, ఆర్డర్!" అన్నప్పుడు.
 • భిన్నత్వంలో ఏకత్వం'-ఒక ఉదాహరణ చెప్పండి?
  జవాబు:వివిధ మతాలు, జాతులు, ప్రాంతాలు కలిగిన మన దేశంలో 'అవినీతి ' మాత్రం ఒక్కటే !
 • మడమ తిప్పితే ఏమవుతుంది?
  జవాబు:'మ డ మ'
 • 'ఎం.ఎల్.ఏ'లకు అసెంబ్లీలో ప్రవేశించే ముందు 'ఎంట్రన్స్ పరీక్ష ' పెడితే ఏమవుతుంది?
  జవాబు: ముందుగా పేపరు లీకవుతుంది!!
 • బాల్యం.....యవ్వనం......వృద్ధాప్యం....ఇదే క్రమంలో‌వచ్చేవి ఏవి?
  కార్టూన్లు....సినిమాలు.....సీరియళ్లు.
 • డాక్టరు నిర్ఘాంతపోయేదెప్పుడు!?
  జవాబు:'షుగర్ మానేసి బెల్లం వాడొచ్చా డాక్టర్?' అని పదేళ్ళుగా మందులేసుకుంటున్న షుగర్ పేషెంట్ అడిగినప్పుడు!!