నిర్మల సురగంగాజల సంగమ క్షేత్రం
రంగుల హరివిల్లుల వెలసిల్లిన నిలయం
భారతదేశం మన జన్మ ప్రదేశం
భారతఖండం ఒక అమృత భాండం

ఉత్తరాన ఉన్నతమౌ హిమగిరి శిఖరం
దక్షిణాన నెలకొన్న హిందుసముద్రం
తూరుపుదిశ పొంగిపొరలు బంగళఖాతం
పశ్చిమాన అరేబియానంతసాగరం           ।భారత।

ఆంధ్ర తమిళ కర్ణాటక కేరళ నిలయం
వంగ త్రిపుర అస్సాముల వెలసిన హారం
రాజస్థాన్ గుజరాత్ పంజాబు ప్రాంగణం
కన్యాకుమారి మొదలు కాశ్మీరం సుందరం     ।భారత।

భిన్నజాతి మతములున్న స్వేచ్ఛ ప్రదేశం
రత్నగర్భ పేరుగన్న మణిమయతీరం
ఆర్యులన్న చరితలున్న ఆలయ శిఖరం
సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం        ।భారత।

కోయిలమ్మ పాడగలదు జాతీయగీతం
కొండ కోన వాగు చూపు శాంతి స్వభావం
గుండె గుండెలోన నిలుపు సమరస బావం
చేయి చేయి కలిపి సాగు ప్రగతుల తీరం      ।భారత।
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song