చరితలోని సారమిదే, భవితలోని భావమిదే వీరగాధ విజయగాధలెన్ని విన్న మూలమిదే వందేమాతరం.. వందేమాతరం వందేమాతరం అంటోంది మాతరం |చరితలోని| అరవింద వివేకానంద రామక్రిష్ణ దయానంద సమర్థుల సందేశం వందే మాతరం ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం వందే మాతరం ఝాన్సీరాణీ రుద్రమాంబ కత్తుల కథలే వందే మాతరం వందే మాతరం వందేమాతరం అంటోంది మాతరం |చరితలోని| మనలోని అనైక్యత జాతీయ భావ హీనత ఆసరగా అధికారం అందుకొనిరిరా విద్వేషం రగిలించి విభజించి పాలించి విద్రోహం తలపెట్టె ఫిరంగి మూకరా బ్రిటిష్ విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం