అమ్మే ఈ జగతికి తొలి సూర్య కిరణం అమ్మ మనసు చల్లనైన జాబిలిరూపం(2) అమ్మమాట మల్లెల మకరందపు మూట అనురాగం పంచేటి అక్షయ తోట అమ్మ అన్న ఆ పిలుపే బంగారం అమ్మ చేసిన బొమ్మే మెడలో మణిహారం |అమ్మే| ఈనాటికి ఏనాటికి అమ్మపిలుపే కోటి ఆ పిలుపుకు లేదులే ఇలలో సాటి అమ్మచూపు నా చూపుకు చుక్కానిరా అమ్మపాటే జోలపాటై నాపాటకు పల్లవిరా |అమ్మే| కనిపించే మా అమ్మే మా దైవము కనిపించని దైవానికి మా అమ్మే దైవము ఈ జన్మలొ ఏ జన్మలొ జన్మించినా మా అమ్మ ఒడిలో నే బిడ్డనేరా |అమ్మే|