సూర్యుడై వెలగాలి చంద్రుడై ఎదగాలి సూర్యుడై వెలగాలి చంద్రుడై ఎలగాలి చీకటి మన పల్లెల్లోనా చిన్నా ..........ఆ..ఆ వెలుగుల్నే పంచాలిరా కన్నా చిన్నా.... వెలుగులనే పంచాలిరా కన్నా చిన్ని చిన్ని అడుగులతో గుండలపై నీవు ఆడుతువుంటే గుండెలపై నీవు ఆడుతువుంటే పండు వెన్నల కాసినట్లాయరా ఆ.....ఆ...... జాబిలిని చూసినట్లాయరా చిన్నా.... జాబిలిని చూసినట్లాయరా సూర్యుడై వెలగాలి చంద్రుడై ఎదగాలి సూర్యుడై ఎలగాలి చంద్రుడై ఎలగాలి చీకటి మన పల్లెల్లోనా చిన్నా ..........ఆ..ఆ వెలుగుల్నే పంచాలిరా కన్నా చిన్నా వచ్చి రాని పలుకులతో ముద్దు మాటలు చెబుతా వుంటే వచ్చి రాని పలుకులతో ముద్దు మాటలు చెబుతాఉంటే ముద్దబంతి విరిసినట్లాయరా ఆ...ఆ... ఆ కొయిలమ్మ కూసినట్లాయరా సూర్యుడై ఎలగాలి చంద్రుడై ఎలగాలి సూర్యుడై ఎలగాలి చంద్రుడై ఎలగాలి చీకటి మన పల్లెల్లోనా చిన్నా ..........ఆ..ఆ వెలుగుల్నే పంచాలిరా కన్నా చిన్నా.... వెలుగులనే పంచాలిరా కన్నా పలక సంకన పెట్టి బడికి పోతానమ్మా అంటే పలక సంకన పెట్టి బడికి పోతానమ్మా అంటే ఎతలన్ని తీరినట్లాయరా ఆ..ఆ..ఆ... ఎద ఉప్పొంగినట్లయరా చిన్నా ఎదప్పొంగినట్లాయరా సూర్యుడై ఎలగాలి చంద్రుడై ఎలగాలి సూర్యుడై ఎలగాలి చంద్రుడై ఎలగాలి చీకటి మన పల్లెల్లోనా చిన్నా ..........ఆ..ఆ వెలుగుల్నే పంచాలిరా కన్నా చిన్నా.... వెలుగులనే పంచాలిరా కన్నా గుడ్డిదీపముకాడా కుచ్చొని బుద్దిగ చదువుతావుంటే గుడ్డిదీపముకాడా కుచ్చొని బుద్దిగ చదువుతావుంటే తలుకు తలుకు మెరిసినట్లాయారా ఆ..ఆ...ఆ.. ఇంద్ర దనసు విరిసినట్లాయరా చిన్నా..... ఇంద్ర దనసు విరిసినట్లాయరా సూర్యుడై ఎలగాలి చంద్రుడై ఎలగాలి సూర్యుడై ఎలగాలి చంద్రుడై ఎలగాలి చీకటి మన పల్లెల్లోనా చిన్నా ..........ఆ..ఆ వెలుగుల్నే పంచాలిరా కన్నా చిన్నా.... వెలుగులనే పంచాలిరా కన్నా