ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే తియ్య తియ్య తాయిలమేదో తీసి పెట్టమ్మా తియ్య తియ్య తాయిలమేదో తీసి పెట్టమ్మా పిల్లి పిల్ల కళ్లు మూసి పీట ఎక్కింది పిల్లి పిల్ల కళ్లు మూసి పీట ఎక్కింది కుక్క పిల్ల తోకాడిస్తూ గుమ్మమెక్కింది కుక్క పిల్ల తోకాడిస్తూ గుమ్మమెక్కింది కడుపులోనే కాకి పిల్ల గంతులేసింది తియ్య తియ్య తాయిలమేదో తీసి పెట్టమ్మా తియ్య తియ్య తాయిలమేదో తీసి పెట్టమ్మా ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే తియ్య తియ్య తాయిలమేదో తీసి పెట్టమ్మా తియ్య తియ్య తాయిలమేదో తీసి పెట్టమ్మా గూటిలోనా బెల్లం ముక్క కొంచం పెట్టమ్మా చేటాలోని కొబ్బరి కోరు జారెడు తీయమ్మా గూటిలోనా బెల్లం ముక్క కొంచం పెట్టమ్మా చేటాలోని కొబ్బరి కోరు జారెడు తీయమ్మా అటక మీద అటకుల కుండా అమ్మాదించమ్మా తియ్య తియ్య తాయిలమేదో తీసి పెట్టమ్మా తియ్య తియ్య తాయిలమేదో తీసి పెట్టమ్మా ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే తియ్య తియ్య తాయిలమేదో తీసి పెట్టమ్మా తియ్య తియ్య తాయిలమేదో తీసి పెట్టమ్మా