బాలలమూ, బాలలమూ
భగవంతుని ప్రతిరూపాలం,
అరుణారుణ రవి కిరణాలం
అరవిరిసిన నవకుసుమాలం
చదువుల్లో, ఆటల్లో మొనగాళ్లం, మేం మొనగాళ్ళం
అపజయాలకూ, నరాశ్యానికి లొంగని మొండి ఘటాలం
బాలలమూ, బాలలమూ
భగవంతుని ప్రతిరూపాలం,
నేటి తరానికి స్ఫూర్తిని ఇచ్చే రేపటి ఆశా దీపాలం
బారతమాత పెదవులపన విరిసిన చిరు దరహాసాలం
బాలలమూ, బాలలమూ
భగవంతుని ప్రతిరూపాలం,
ప్రగతి పథంలో జాతిని నడిపిన
గాంధీ నెహరూ వారసులం
త్యాగం, ధైర్యం, సచ్ఛీలతకు తరగని చెరగని పెన్నిధులం
బాలలమూ, బాలలమూ
భగవంతుని ప్రతిరూపాలం