పది చిలకలు పాడుతుండగా,
పాడలేక ఒకటిపోతె ఇంకా తొమ్మిది
తొమ్మిది చిలకలు తూగుచుండగా,
తూగలేక ఒకటిపోతె ఇంకా ఎనిమిది
ఎనిమిది చిలకలు ఎగురుతుండగా,
ఎగరలేక ఒకటిపోతె ఇంకా ఏడు
ఏదు చిలకలు ఏడ్చుచుండగా,
ఏడ్చలేక ఒకటిపోతె ఇంకా ఆరు
ఆరు చిలకలు ఆడుచుండగా,
ఆడలేక ఒకటిపోతె ఇంకా అయిదు
ఐదు చిలకలు అరచు చుండగా,
అరచలేక ఒకటిపోతె ఇంకా నాలుగు
నాలుగు చిలకలు నవ్వుతుండగా,
నవ్వలేక ఒకటి పోతె ఇంకా మూడు
మూడు చిలకలు మూల్గుతుండగా,
మూల్గలేక ఒకటిపోతె ఇంకా రెండు
రెండు చిలకలు రేగుచుండగా,
రేగలేక ఒకటిపోతె ఇంకా ఒక్కటి
ఒక్క చిలుక వంచుచుండగా,
వంచలేక ఒకటిపోతె ఇంకా సున్నా.!