మరిన్ని సొంత కథలు రాయండి!
కొత్తపల్లికి ఏడేళ్ళ సందర్భంగా పిడూరి కృష్ణమూర్తి తాతగారు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఇస్తున్న కానుక!
మీరు సొంతగా ఊహించి రాసిన కథ కొత్తపల్లిలో ప్రచురితమైతే ఇప్పుడు ఓ కొత్తపల్లితో‌బాటు తాతగారి తరపున 100రూ.ల నగదు బహుమతిని కూడా అందుకోండి! ఈ బహుమతి కేవలం మనదేశంలో నివసిస్తున్న పిల్లలకు మాత్రమే! మరి కాయితాలు, పెన్ను తీయండి- నడుం బిగించండి- ఓ చక్కని సొంత కథ రాసేసి పంపండి. చివర్లో మీ పేరు, తరగతి, మీరు చదివే బడి పేరు, మీ చిరునామా, మీవాళ్ళ ఫోను నెంబరు రాయటం మర్చిపోవద్దండి!