అనగనగా రాజు!

అనగగా రాజు
పెడతాడు పెద్ద పోజు
మూరెడుమూరెడుమీసాలు
బారెడు బారెడు గడ్డాలు
గుర్రాలమీద సవారీ
పోలీస్ చూస్తే పరారీ!
జున్ను వెన్న!

జున్ను వెన్న తెల్లన
దున్నపోతు నల్లన
అన్న పేరు ఎర్రన్న
నా పేరు పుల్లన్న
లేలేత మొగ్గ

లేలేత మొగ్గ
విచ్చితే పువ్వు
కాసితే కాయ
మెక్కితే పండు
తింటే తియ్యన
నీకింతా ఇయ్యను