పాకుతూ పాపాయి

పాకుతూ పాపాయి పైడినీ పట్టింది
వెన్న దొంగలా పోయి వెండినీ లాగింది
కథలు రాస్తానంటు కలాన్ని కొరికింది
తెలుగు మధురిమ నేనంటూ తేనెనూ తీసింది
చదువులో ముందంటు పొత్తాన్ని ఎత్తింది
ఏ దేశ మేగినా ఎందు కాలిడినా
అమ్మ బిడ్డ నేనంటూ ఎత్తుకోమంది !!





నిర్లక్ష్యం కూడదు

జీడిపప్పు -జీడిపప్పు మాడి పోయింది
పక్కనున్న రైలు బండి పారిపోయింది
చేనంతా ఆవు దూడ తొక్కి పోయింది
కొతులొచ్చి కొమ్మలన్ని విరిచి పోయాయి
పిట్టలలొచ్చి కంకులన్నీ పొడిచి పోయాయి
నిర్లక్ష్యం కూడదని అర్థమయింది !