1. నల్లని అడవిలో తెల్లని దారి.. ఏంటది?

  2. రెండు పళ్ళాలలో ఒక గారె... (తెలంగాణలో దొరికే ప్రత్యేకమైన అడవి పండు ఇది!) ఏంటో?

  3. చీకటింట్లో జడల దయ్యం! అమ్మో, ఏంటది?

  4. పచ్చని చెట్టు క్రింద ఎర్రని పెళ్ళి కూతురు! ఎవరట, ఆ పిల్ల?

  5. గంపెడు శనగల్లో ఒక రాయి- ఎవరమ్మా అది?

  6. ఒక ఇంట్లో 50 మంది దొంగలు! ఎవరు, వాళ్ళు?

  7. బట్టలు విడిచి-బావిలో దూకె! ఎవరది?

  8. వంద మంది దొంగలకు ఒకడే పోలీసు! ఏమా కథ?

  9. దట్టమయిన అడవిలో ఒక రకపు జంతువే! ఏంటది?

  10. చూస్తే పొట్టివాడు, ఇంటికి గట్టివాడు! ఎవరు వాడు?!

  11. తోకలేని పిట్ట- తొంభై ఆమడలు పోతుంది. ఏంటా పిట్ట?!

  12. ఒక పెట్టెలో ఇద్దరు దొంగలు! (ఒక్కోసారి ఒక్కరే ఉంటారు, ఒక్కోసారి ముగ్గురూ‌ఉంటారు!) ఎవరు వాళ్ళు?!

  13. శరీరమంతా కళ్ళుంటాయి, చేపను కాదు. పడ్డదాన్ని మటుకు వదలను.. ఎవరు నేను?

  14. వెయ్యంగా వెయ్యొస్తది, తియ్యంగా తియ్యరాదు! ఏంటది?

  15. తోకతో తీసుకుంటుంది, నోటితో వదులుతుంది! ఏంటది?

  16. తెల్లనిపొలంలో నల్లని విత్తనాలు! ఏంటవి?

  17. అడవిలోపుట్టింది- అడవిలో పెరిగింది- మాయింటి కొచ్చింది- తైతక్కలాడింది!

  18. ఒక్కదానికి యాభై పళ్ళు! ఏంటది?!

  19. ఒక్క గోడకు రెండు వైపులా ఇల్లులు! ఎక్కడ అవి?

  20. ఊరంతా తిరుగుతాయి, మూలకు వచ్చి చేరతాయి! ఏంటవి?

  21. అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే విడిపోతాయి! ఏమిటి?

  22. కిటకిట తలుపులు, కిటారు తలుపులు, ఎప్పుడు తెరిచినా చప్పుడు కావు! ఏంటవి?

  23. ఇల్లంతా నాకుతుంది. మూలకు చేరి కూర్చుంటుంది. ఏంటది?







ఈ పొడుపు కథలకు జవాబులు:

  1. పాపడ
  2. మొర్రిపండు గింజ
  3. ఉట్టి
  4. పండు మిరప కాయ
  5. చంద్రుడు
  6. అగ్గిపుల్లలు
  7. అరటిపండు
  8. చీపురు
  9. పేను
  10. ఉత్తరం
  11. తాళం
  12. వేరు శెనగ కాయ (పల్లీ)
  13. వల
  14. ముల్లు
  15. దీపం
  16. కాగితం, అక్షరాలు
  17. కవ్వం
  18. దువ్వెన
  19. ముక్కు
  20. చెప్పులు
  21. పెదవులు
  22. కను రెప్పలు
  23. చీపురు(పరక)