1.జూ అధికారి నూతన దంపతులను ఎలా ఆశీర్వదిస్తాడు?
"చిలకా గోరింకల్లా " వుండండి!!
2.జర్నలిస్టుకి దేవుడు ప్రత్యక్షం అయితే.....?
ఇంటర్వ్యూ చేస్తాడు!!
3.తాజ్ మహల్ ఎక్కడ ఉంది?
జవాబు: కట్టిన చోటే!
4.చలికాలంలో ఐ స్ క్రీం తింటే ఏమవుతుంది?
జవాబు: కప్పు ఖాళీ అవుతుంది.
5.ఆటలు ఆడని ప్లేయర్?
జవాబు: సీడీ ప్లేయర్!
6.డ్రైవర్ లేని బస్ ?
జవాబు: సిలబస్!
7.రెండు మామిడి పళ్ళను ముగ్గురు పంచుకోవచ్చు. ఎలా?
జవాబు:రసం తీసి!
8.చింటూ చాల్-లేట్ ఇస్తే తినలేదు ఎందుకు?
జవాబు: చాకును ముందిచ్చినా లేటుగా ఇచ్చినా తినలేడుగా!
గుడికి వెళ్ళినప్పుడు బొట్టుదేనికి పెట్టుకుంటారు?
జవాబు: నుదుటికి!నాలుకపై పెడతారుగానీ మింగరు.. ఏమిటది?
జవాబు: తపాలా బిళ్ళ!తన పిల్ల కనబడకపోతే కంగారు ఏమని ఏడుస్తుంది?
జవాబు: 'నా జేబు ఎవరో కొట్టేశారు!' అని!దోమ తన పిల్లని సర్కస్ గుడారంలోకి వెళ్ళద్దని చెప్పింది. ఎందుకు?
జవాబు: అందరూ చప్పట్లు కొడతారు కాబట్టి!బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు?
జవాబు: పట్టినంత మంది!ఆఫ్రికా గిరిజనులు అరపండు ఎలా తింటారు?
జవాబు: ఒలుచుకొని !ఆ ఇంట్లో బోలెడు డబ్బు నగలున్నాయి. ఒక గజదొంగ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు ఎవరూ లేరు. అయినా అతను ఆ ఇంటిని దోచుకోలేదు ఎందుకు?
జవాబు: అది తన ఇల్లే కాబట్టి!మనిషి కాళ్ళు ఎంతపొడవు ఉండాలి?
జవాబు: నేలకు అందేంత!