ఏం తెలివి!
టీచరుగారు: రాజూ చరిత్ర గురించి నీకు తెలిసింది చెప్పు!
రాజు: ' గతం గత: ' వదిలెయ్యండి టీచర్!
గొడుగు నానితే ఎలా?
రాజు: వర్షంలో తడుస్తావేమో, గొడుగు పట్టుకెళ్ళు.
పిసినారి నాన్న: అదేం తెలివిరా! కొత్త గొడుగు నాని పోదూ!?
ఇంగ్లీషు జోకు!
రవి: సార్! 'యూ ఆర్ ఎ ఫూల్ ' అంటే ఏంటి సార్?
టీచరుగారు: నువ్వొక పనికి మాలిన వెధవ్వి.
రవి: చెప్పటం ఇష్టం లేకపోతే చెప్పకండి సార్! ఊరికే ఎందుకు తిడతారు?
నమలండి!
తండ్రి: ఏరా, అన్నం నములుతూ అంకెలు లెక్క పెడుతున్నావేమి?
వెంగళప్ప: అన్నాన్ని ఒకేసారి మింగద్దు; పదిసార్లు నమిలి మ్రింగు అని మీరేచెప్పారు కదండీ!
(పై నాలుగు జోకులు పోస్టు కార్డులో రాసి పంపినవారు: కె. దామోదర్, 8A, జవహర్ నవోదయవిద్యాలయ, లేపాక్షి)
ఎక్కడయినా పర్లేదు!
ముష్టివాడు: అయ్యా! ఒక పైసా దానం చెయ్యండి బాబు.
బాబు (కోపంగా): నేను రోడ్డుమీద ముష్టివాళ్లకు దానం చెయ్యను!
ముష్టివాడు: అలా అయితే ఇంటి అడ్రసు చెప్పండి సార్.... అక్కడే కల్టెక్ చేసుకుంటాను
సులభ మార్గం!
కొడుకు: నాన్న, మనం త్వరలో ధనవంతులం కాబోతున్నాం.
తండ్రి: నువ్వెలా చెప్పగలుగుతున్నావు?
కొడుకు: రేపు మా టీచర్ పైసలను రూపాయిల్లోకి ఎలా మార్చాలో నేర్పుతానన్నారు.
భగవంతుని లీల!
డాక్టర్: డోంట్‌వర్రీ... ఈ జన్మని ప్రసాదించింది భగవంతుడు, అంతా ఆయన చేతుల్లోనే ఉంది, అన్నాడు.
పేషంట్: అయితే , మరి మీ చేతుల్లో ఏముంది?
డాక్టర్: మందులు రాయడం, ఫీజులు వసూలు చేయడం.