
తోటి పిల్లలతో కలసి ఆటలాడింది సునీత- ఒళ్ళంతా బురద పూసుకున్నది. ఆ తరువాత ఇంటికి పరిగెత్తి పోయి వాళ్లమ్మ ఎదుట నిలబడి "నేనెవరు?" అని అడిగింది.
'ఇదేదో కొత్తఆట' అనుకొని, వాళ్లమ్మ "తెలియడం లేదే! ఎవరమ్మా, నువ్వు?" అన్నది.
"ఆహా, వనితా ఆంటీ చెప్పింది సరిపోయింది! కన్నతల్లి కూడా గుర్తించలేనట్లు ఉన్నానని చెప్పింది!" అన్నది సునీత ఆశ్చర్యపోతూ.
సర్వర్: చట్నీ లేని ఇడ్లీ, కూరలేని పూరీ, పంచదార లేని కాఫీ- వీటిలో ఏం కావాలి సార్?
కస్టమర్: చెప్పినవన్నీ ఇచ్చి, అంకెలు వేయని బిల్లు ఇవ్వు.
డాక్టరు, లాయరు!
రాహుల్, రాణి ఏం ఆట ఆడుదామా అని ఆలోచిస్తున్నారు.
రాహుల్: డాక్టర్ ఆట ఆడుకుందామా?
రాణి: చాలా బాగుంటుంది- నువ్వు ఆపరేషన్ చెయ్, నేను కేసు పెడతాను!
ఇనప మనిషి!
కస్టమర్: శరీరంలో ఐరన్ లోపించిందన్నాడు డాక్టరు..ఇనుము ఎక్కువగా ఉండేవి ఏమున్నాయ్ ?
సర్వర్: దోసెల పెనం, బాణలి..ఇంకా వేరేవి గుర్తురావట్లేదు సార్!
బుజ్జి పిట్ట
బుజ్జిపిట్ట, బుజ్జిపిట్ట qaodmasdkwaspemas21ajkqlsmdqpakldnzsdfls
ఎక్కడికి వెళ్ళావు గబుక్కున qaodmasdkwaspemas20ajkqlsmdqpakldnzsdfls
నాకు నువ్వున్నావు qaodmasdkwaspemas19ajkqlsmdqpakldnzsdfls
నీకు నేనున్నాను qaodmasdkwaspemas18ajkqlsmdqpakldnzsdfls
రోజూ రా! మా ఇంటికి qaodmasdkwaspemas17ajkqlsmdqpakldnzsdfls
రోజూ పో! నీ గూటికి qaodmasdkwaspemas16ajkqlsmdqpakldnzsdfls
నువ్వు గాలిలో ఆడితే qaodmasdkwaspemas15ajkqlsmdqpakldnzsdfls
నేను నేల మీద ఆడతా qaodmasdkwaspemas14ajkqlsmdqpakldnzsdfls
ఇద్దరం కలసి హాయిగా ఆడుదాం qaodmasdkwaspemas13ajkqlsmdqpakldnzsdfls
కడతా నీకు ఒక గూడు qaodmasdkwaspemas12ajkqlsmdqpakldnzsdfls
పెడతా నీకు ఆహారం qaodmasdkwaspemas11ajkqlsmdqpakldnzsdfls
బుజ్జిపిట్ట, బుజ్జిపిట్ట qaodmasdkwaspemas10ajkqlsmdqpakldnzsdfls
ఎక్కడికి వెళ్తావు గబుక్కున qaodmasdkwaspemas9ajkqlsmdqpakldnzsdfls
చూసుకుంటూ నిన్ను అమ్మలా qaodmasdkwaspemas8ajkqlsmdqpakldnzsdfls
నీళ్ళు తాపిస్తా తండ్రిలా
ఆడిపిస్తా నిన్ను అన్నలా
ఎత్తుకుంటా నిన్ను చెల్లిలా
బుజ్జిపిట్ట, బుజ్జిపిట్ట
ఎక్కడికి వెళ్తావు గబు క్కున
రచన: వి.ధనుష్, 8వ తరగతి, తేజా విద్యాలయం, కోదాడ, నల్గొండజిల్లా.