అదిగో అదిగో లైటు
గానం: బి.హేమ, 4వతరగతి, యంపియుపియస్, బద్దలాపురం, కనగానపల్లిమండలం, అనంతపురంజిల్లా.
అదిగో అదిగో లైటు
అమ్మానాన్న ఫైటు
కోడి గుడ్డు వైటు
నేను చెప్పింది రైటు
అరటి పండు చూడరా
గానం: పూజిత, 3వతరగతి, యంపియుపియస్, బద్దలాపురం, కనగానపల్లిమండలం, అనంతపురంజిల్లా.
అరటి పండు చూడరా
అందమైన పండురా
కాయేమో పచ్చన-
అరటిపండు తియ్యన!
చిట్టి చిలకమ్మ
గానం: సింహాద్రి, 2వతరగతి, యంపియుపియస్, బద్దలాపురం, కనగానపల్లిమండలం,అనంతపురంజిల్లా.
చిట్టి చిలకమ్మా
పలక ఏదమ్మా?
పావురాయమ్మ
పట్టుకెళ్లిందా?
పరుగున పోవమ్మా
పలక తేవమ్మా
పండు తిమ్మా!
చిట్టిచిట్టి మిరియాలు
గానం: మైత్రి,2వతరగతి,యంపియుపియస్,బద్దలాపురం, కనగానపల్లిమండలం,అనంతపురంజిల్లా.
చిట్టి చిట్టి మిరియాలు
చెట్టూ కిందా పోసి
బొమ్మరిల్లు కట్టి
అల్లం వారింటికి చల్లకుపోతే
అల్లం వారి కుక్క "భౌ భౌ" మన్నది
నా కాళ్ళ గజ్జెల్ ఘల్ ఘల్ మన్నవి.
చిలకా చిలకా రావే
గానం: శివ, 2వ తరగతి, యంపియుపియస్, బద్దలాపురం, కనగానపల్లిమండలం,అనంతపురంజిల్లా.
చిలకా చిలకా రావే
ఈగో గింజలు తినవే
రానూ రానూ దగ్గరకి
వస్తే నన్ను పట్టేస్తావ్
పంజరంలో పెట్టేస్తావ్
పగటి దీపం సూర్యుడు
గానం: హర్షిత, 4వతరగతి, యంపియుపియస్, బద్దలాపురం, కనగానపల్లిమండలం, అనంతపురంజిల్లా.
పగటి దీపం సూర్యుడు
రాత్రికి దీపం చంద్రుడు
జాతీయ దీపం విద్య
దానికి రూపం బాలలు
చదవాలి అందరం
చదవులేక అంధులం
చీకటి దారులు దాటగా
చదువేగద సాధనం!