నిరీక్షణ

నిరీక్షణ అంటే తెలుసుగా, 'వేచి చూడటం'- ఇదిగో, ఇక్కడ నిల్చున్న పాప లాగా దేనికోసమో ఎదురు చూస్తూ నిలబడటం.

ఇంతకీ ఈ పాప ఎందుకు, ఇట్లా ఎండలో, రోడ్డు ప్రక్కన నిలబడి చూస్తున్నది? బస్సు కోసమా? లేకపోతే రోడ్డు దాటదామనుకుంటున్నదా? ఎక్కడికి వెళ్తున్నది...? కొంచెం ఆలోచించారంటే మంచి కథ ఒకటి తడుతుంది మీ మనసుకు. ఆ కథని రాసి మాకు పంపండి. బాగుంటే రెండు నెలల తర్వాత ప్రచురిస్తాం. మొదలు పెట్టండి మరి!