1. ఇంకేమీ చేయకుండా కట్టిపడేసే 'దనం' ఏంటి?
జవాబు: వందనం !
2. తినగలిగే నగ?
జవాబు: శెనగ!
3. అమెరికాలో సైనికులు కవాతు వేటితో చేస్తారు?
జవాబు: కాళ్ళతో!
4. గేటు తెరిచి వున్నా వెంగళప్ప పార్కులోకి ఎందుకు వెళ్ళటం లేదు?
జవాబు: బయట 'నో పార్కింగ్' అని ఓ బోర్డు వుందిగా?!
5. ధనవంతుడు ఏం సంపాదించాలి?
జవాబు: సంతృప్తి!
6. వెంగళప్ప కారుని ఎక్కడ పార్క్ చేస్తాడు?
జవాబు: పార్కులో !
8. పొరిగింటి పుల్లకూర రుచి- ఒక ఉదాహరణ ఇవ్వండి!
జవాబు: తెలుగు మేస్టారు తమ కొడుకుని ఇంగ్లీషు కాన్వెంట్ లో చదివించటం!