మరో క్రొత్త ఉగాది- మనకు వచ్చెనమ్మా
వేప మామిడి పూచి -వేడుక చేసెనమ్మా (2)
కావు కావు కావుమని -కాకులు అరచిన మావిని
కోయిలమ్మ కమ్మగా -కొలువుదీరి పాడెనదే (3)
"మరో క్రొత్త ఉగాది"
వాకిలంత ఆకురాల్చి -వాడి మ్రోడైన వేప
పాలజల్లు కురిసినటుల -పూలురాల్చె నేడు చూడు (3)
"మరో క్రొత్త ఉగాది "
ఊపిరణగి ఉన్నటుల -పుల్లలైన మల్లెతీగ
చివురులు సింగారించి-తీగె సాగెనమ్మ నేడు (3)
"మరో క్రొత్త ఉగాది "