సమయస్ఫూర్తిగల ఉల్లి వ్యాపారి ఎవరు?
"పది కేజీలు ఉల్లిపాయలు కొన్నవారికి ఒక కర్చీఫ్ ఉచితం" అని ప్రకటన ఇచ్చేవాడు!





బ్యాంక్ మ్యానేజర్ బుర్ర గోక్కునేదెప్పుడు?
బ్యాంక్ కొనుక్కోటానికి లోన్ కావాలని కస్టమర్ అడిగినప్పుడు!





తెలివైన టపాకాయల వ్యాపారిఏమని ప్రకటించాడు?
"రిమోట్ తో పేల్చే దీపావళి బాంబులు మా ప్రత్యేకత!" అన్నాడు.



మిమిక్రీ‌ ఆర్టిస్టు మొహం ఎప్పుడు మాడిపోయింది?
"కుక్కను పెంచుకుందాం" అని తన భార్యతో అంటే, "మీరు ఉండగా అదెందుకులెండి" అని ఆవిడ అన్నప్పుడు!



"జగన్నాటకం" అనే సీరియల్ చూస్తున్న ప్రేక్షకులు నోళ్ళెప్పుడు వెళ్ళబెడతారు?
టైటిల్సులో "కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- 'భగవంతుడు' " అని కనబడ్డప్పుడు!



"కోటి విద్యలు కూటికొరకే" సామెత పాతదైపోయింది.. మరి కొత్తదేమిటి?
"కోటి విద్యలు కోటి కొరకే"


వాతావరణశాఖ అధికారి కొడుకుని మేస్టారు హోంవర్కు అడిగితే ఏమన్నాడు?
"ఇంట్లో వాతావరణం బాగాలేక, చెయ్యలేదు సార్" అన్నాడు!






నిద్రపోతున్న హోం మినిస్టర్ ఉలిక్కిపడి నిద్రలేచేదెప్పుడు?
దేవుడు కలలో కనబడి 'నా గుడికి సెక్యూరిటీ పెంచు' అని ఆదేశించినప్పుడు!