ఈ బొమ్మను చూస్తే మీకేమనిపిస్తున్నది?
అబ్బ! ఏం చెత్తరా బాబూ! ఎక్కడెక్కడి చెత్తా మన దగ్గరికే గదా, చేరుకునేది? ఆ చెత్తలోని క్రిములు, రసాయనాలు, అన్నీ మనలోకే చేరుకుంటున్నై! చెత్తని తయారు చేసేదీ మనమే, దాన్ని అసహ్యించుకునేదీ మనమే, చివరికి ఏమీ అనలేక దాన్ని స్వీకరించేదీ మనమే! ఈ చెత్తను చూస్తే ఏదేదోచెప్పాలని అనిపిస్తోంది గదూ? ఏదైనా చక్కని కథ మనసుకు తట్టిందా? అయితే వెంటనే చెప్పెయ్యండి! ఆ కథను వీలైనంత తొందరగా మాకు పంపించండి. బాగున్న కథలను కొత్తపల్లి పత్రిక ఏప్రియల్ 2011 సంచికలో ప్రచురిస్తాం.
మా చిరునామా:
కొత్తపల్లి బృందం, 2-312,
చెన్నేకొత్తపల్లి - 515 101,
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
(ఇ-మెయిలు: team@kottapalli.in)