అమ్మ కన్న అవనిలో దైవమెవ్వరు?
అమ్మకన్న సృష్టికే మూలమెవ్వరు?
పలుకలేని పశువులైన
పిలువనేర్చు 'అమ్మా' యని
పాలు లేని పక్షులైన పెంచనేర్చు తమ పిల్లల-
గుండెలోన కౄరత్వం గూడుగట్టు మృగానికి
సృష్టిలోన సహజమగును మాతృత్వపు మమకారం
"అమ్మకన్న అవనిలో"
ఆటు పోటు తగులుచుండు సప్తసముద్రాలకైన
తరుగుచుండు పెరుగుచుండు రవిచంద్రుల తేజమైన
ఆదినుండి తరగనిది అమ్మ ప్రేమ ఒక్కటే (2)
"అమ్మకన్న అవనిలో"
ఉన్ననాడు లేనినాడు కన్నతీపి ఒక్కటే
అయోగ్యుడైన యోగ్యుడైన ఆదరణ ఒక్కటే
ఉన్న కనులు రెండైనా పాపకొక్క రెప్ప అమ్మ (2)
"అమ్మకన్న అవనిలో"