చెట్టు చెట్టు పుట్టిందంట ఏమి చెట్టు పుట్టిందంట
రాజమండ్రి యోజంలో జామ చెట్టు పుట్టిందంట
చెట్టు చెట్టు పుట్టిందంట ఏమి చెట్టు పుట్టిందంట
అవునాటే అక్కల్లారా? అవునాటే బావల్లారా?
సూరీడో గొబ్బిళ్ళో సూరీడో గొబ్బిళ్ళో!

పూత పూత పూసిందంట ఏమి పూత పూసిందంట
రాజమండ్రి యోజంలో జామ పూత పూసిందంట
అవునాటే అక్కల్లారా? అవునాటే బావల్లారా?
సూరీడో గొబ్బిళ్ళో సూరీడో గొబ్బిళ్ళో!

పిందె పిందె కాసిందంట ఏమి పిందె కాసిందంట
రాజమండ్రి యోజంలో జామ పిందె కాసిందంట
అవునాటే అక్కల్లారా? అవునాటే బావల్లారా?
సూరీడో గొబ్బిళ్ళో సూరీడో గొబ్బిళ్ళో!

కాయా కాయా కాసిందంట ఏమి కాయ కాసిందంట
రాజమండ్రి యోజంలో జామ కాయ కాసిందంట
అవునాటే అక్కల్లారా? అవునాటే బావల్లారా?
సూరీడో గొబ్బిళ్ళో సూరీడో గొబ్బిళ్ళో!

పండు పండు పండిందంట ఏమి పండు పండిందంట
రాజమండ్రి యోజంలో జామ పండు పండిందంట
అవునాటే అక్కల్లారా? అవునాటే బావల్లారా?
సూరీడో గొబ్బిళ్ళో సూరీడో గొబ్బిళ్ళో!

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song