అమ్మ అంటుంది కదా,
"మన ఇల్లొక అడవి!
పిల్లలు కోతులు,
కుర్చీలు, మంచాలు, చెట్లు ఎక్కినట్టు ఎక్కుతారు!"





నాన్న అంటారు,
"మన ఇల్లొక సినిమా హాలు!
పిల్లలు కథానాయకులు,
పెద్దలు ప్రేక్షకులు!"





మా స్నేహితులంటారు,
"మీ ఇల్లొక గ్రంథాలయం!
నిజంగానే,
మీ ఇంటి నిండా ఎన్ని పుస్తకాలు!"








మా నాయనమ్మ అంటుంది,
"మన ఇల్లు కావాలి ఒక దేవాలయం!
పిల్లల గొంతులు గుడిలో గంటలు,
మంచి మాటలు మన ప్రార్థనలు,
సంతృప్తి, సంతోషం తీర్థ ప్రసాదాలు!"