కొండలమీద వెన్నెల కాసె ఎన్నెల్లాయెలో
ఎర్ర కాకి పెళ్ళీ అంట ఎన్నెల్లాయెలో
కప్ప పిల్ల కనుకొండె ఎన్నెల్లాయెలో
ఉడత పిల్ల ఊరిలో చెప్పె ఎన్నెల్లాయెలో
నాగ పాము నలుగుతెచ్చె ఎన్నెల్లాయెలో
పూడు పాము పూలు ముడిచె ఎన్నెల్లాయెలో
పసుడు పాము పసుపు పూసె ఎన్నెల్లాయెలో
కుందెలు పిల్ల కుంకుమ పెట్టె ఎన్నెల్లాయెలో
మేక పిల్ల మేళం కట్టె ఎన్నెల్లాయెలో
పంది కొక్కు డోలు కొట్టె ఎన్నెల్లాయెలో
“కొండలమీద వెన్నెల కాసె”