కుహూ కుహూమని పాడే కోయిలమ్మా
అహా అహా ఎంత హాయి నీ పాటమ్మా !
'కుహూకుహూ '
రాగ తాళ బద్ధమైన సంగీత శాస్త్రమును
వత్సరాలు వెచ్చించి నేర్చిన వారైన
హాయినింపె ఒక్క గమకమనగలరా నీ వలెనే?
సామవేదమునకు ముందె సంగీత నిధివి నీవు
'కుహూ కుహూ'
యుగాల కాల గమనంలో వేగమంటు సంగీతం
రాళ్లు గిలకరించినటుల రణగొణ ధ్వని అయినది
విధాత నేర్పిన పాటే పాడుచుంటి వీవిపుడు
పసగలదీ పాతదైన రసహీనముకన్న మిన్న
'కుహూ కుహూ'
ఆమని శుభవేళ అరుదెంచిన తొలి అతిథీ
పిలుపులేక వచ్చానని మోము చూప వెరపా?
ఆత్మీయుల రాకెపుడూ ఆనందమె కదటమ్మా?
జగతి మరచు మగత- కలిగించు కూసె కూత
'కుహూ కుహూ'