ఏలేలమ్మా ఏలేలో
యెన్నేలమ్మా యెన్నేలో
రంగుల విల్లు మన హరివిల్లు
నింగిన నిలచిన ఆ హరివిల్లు
"రంగుల విల్లు"

ఎరుపు నీలం‌ పచ్చా పసుపు
కాషాయాల కలగలుపు
కంటిగింపుగా కనిపించునులే
కనుల పండువుగ ఉండునులే
"రంగుల విల్లు"

అనురాగానికి హారతి పట్టును
ఏడు రంగులలో ఎర్రని రంగు
హృదయానికి మరి అభ్యుదయానికి
ఊపిరులూదును ఆ రంగు
"రంగుల విల్లు"

అన్నార్తులకు హారతి పట్టును
ఏడు రంగులలో పచ్చని రంగు
సశ్యతకు మరి అది సంకేతం
సశ్యశ్యామలం మన దేశం
"రంగుల విల్లు"

ప్రశాంతతకు హారతి పట్టును
ఏడు రంగులలో నీలం రంగు
నింగి రంగుకు ధీటుగ నిలిచి
హంగును కూర్చును ఆ రంగు
"రంగుల విల్లు"

ఆరోగ్యానికి హారతి పట్టును
ఏడు రంగులలో పసుపు రంగు
సౌభాగ్యానికి అది ఆవాహం
పచ్చని మిస మిస నా దేహం
"రంగుల విల్లు"

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song