జోకులు
టీచరు
టీచరు ఒక పిల్లవాణ్ని అడుగుతుంది.
టీచరు: బాలూ! నువ్వు పెద్ద అయిన తరువాత ఏమవుతావు?
బాలు: నేను మీ లాగా పెద్ద టీచరు అవుతానుటీచర్!
టీచరు: టీచరు కావాలంటే ఏం చేయాలిరా?
బాలు: టీ లోకి చారు పోస్తే టీచరు అవుతారు మేడం.
సేకరణ: సి. పవన్, 5 వ తరగతి, టింబక్టు బడి.
రాకెట్ - విమానం
రాకెట్ మరియు విమానం ఇలా మాట్లాడు-కుంటున్నాయి.
విమానం: రాకెట్ తమ్ముడూ, రాకెట్ తమ్ముడూ నువ్వు అంత వేగంగా వెళ్తావు, కాని మేము మాత్రం అంత నిదానంగా వెళ్తాము, ఎందుకు?
రాకెట్: నీ కింద మంట పెడితె నువ్వు నా కంటే వేగంగా వెళ్తావు.
సేకరణ: యు. రేణుక, 9వ తరగతి, ప్రకృతి బడి.
గురు శిష్యులు
గురు శిష్యులు మాట్లాడుకుంటూ ఉంటారు.
గురువు: మీరు ఎందుకు నన్ను గురువర్యా! గురువర్యా! అని ఎప్పుడూ పిలుస్తూ ఉంటారు. చెప్పండి.
శిష్యులు: మీరు పడుకున్నాక ఎప్పుడూ గొరకలు పెడుతూ ఉంటారు కాబట్టి, మిమ్మల్ని అలా అంటాం గురువర్యా!
సేకరణ: పి.విశ్వనాథ్,7వ తరగతి,టింబక్టు బడి.
బల్లుల ఆనందం
ఒక గోడ మీద రెండు బల్లులు ఉంటాయి. అందులో మొదటి బల్లి పాట పాడుతూ ఉంటుంది. రెండవ బల్లి అనుకోకుండా జారిపోతుంది.దీనికి కారణం ఏమై ఉంటుంది?
జవాబు: ఒకటవ బల్లి పాట పాడినందుకు రెండవ బల్లి సంతోషంతో చప్పట్లు కొట్టింది. కనుక రెండవ బల్లి కిందికి పడిపోయింది.
సేకరణ: యం.సుధ, 7వ తరగతి, టింబక్టు బడి.
క్షమించండి
రామనాథం: మీ దొడ్లో నిన్న చల్లిన విత్తనాలను మా కోడి తినేసింది. నన్ను క్షమించండి.
గుర్నాథం: మీరు నన్ను క్షమించండి.
రామనాథం: ఎందుకు?
గుర్నాథం: ఈ రోజు ఉదయం మా గుమంలోకి వచ్చిన మీ కోడిని మాకుక్క తినేసింది.
రామనాథం: ఈ సారి మీరు నన్ను నిజంగా క్షమించాలి.
గుర్నాథం: ఏమిటి విషయం చెప్పండి.
రామనాథం: మీరు క్షమించానంటే విషయం చెబుతాను.
గుర్నాథం: అలాగే చెప్పండి.
రామనాథం: నేను బయటకు వెళ్ళి వస్తుంటే ఇప్పుడే మీ కుక్క నా కారు కింద పడి చచ్చిపోయింది.
గుర్నాథం: ఆ...!
సేకరణ: జి. శంకరయ్య, 10వ తరగతి, జాబిల్లి బాలల సంఘం, హరియాన్ చెర్వు.
టీచర్: రాజూ గాంధీ తాత గురించి చెప్పు.
రాజు: గాంధీ గురించి తెలుసుగానీ, వాళ్ళ తాత గురించి నాకు తెలియదు టీచర్.
సేకరణ: జి. క్రిష్ణవేణి, మదర్ థెరిసా బాలల సంఘం, శ్యాపురం.
క్రిములు అరుస్తాయి!
స్కూల్ విద్యార్థులకు ఫిజిక్స్ క్లాసు జరుగుతోంది. టీచర్ ప్రాక్టికల్స్ చేసి విద్యార్థులకు చూపిస్తోంది. మరుగుతున్న నీళ్ళను చూపెట్టి టీచర్ పిల్లలను ఈ విధంగా అడిగింది.
"నీళ్ళు కాచినప్పుడు శబ్దం ఎందుకు వస్తుంది?" దానికి రవి అనే విద్యార్థి ఈ విధంగ సమాధానం చెప్పాడు. "నీళ్ళు మరిగే ముందు దానిలో ఉండే క్రిములు బాధతో అరుస్తాయి మేడం. అందుకే శబ్దం వస్తుంది!".
సేకరణ: డి.అనిల్ కుమార్, 9వ తరగతి, జాబిల్లి బాలల సంఘం, హరియాన్ చెర్వు
భర్త: నీకు ఎన్నిసార్లు చెప్పను. కంటి అద్దాలు పెట్టుకుందే వంట చేయవద్దని. ఇటు చూడు వెంట్రుకలు ఎలా ఉన్నాయో!
భార్య:మీకు ఎన్నిసార్లు చెప్పాను. అన్నం తినేముందు కంటి అద్దాలు పెట్టుకోమని. అవి వెంట్రుకలు కాదు, కొత్తిమీర కాడలు.
నిదానమే ప్రధానం!
రాము బడి గంట కొట్టినా నెమ్మదిగ వస్తున్నాడు. అప్పుడు టీచర్ ఇలా అంటున్నాడు.
టీచర్: ఏంటిరా రాము గంట కొట్టినా నెమ్మదిగా వస్తున్నావు.
రాము: మీరే కదా సార్! "నిదానమే ప్రధానము" అన్నారు.
మధ్యాహ్నం వేళ భోజనానికి గంటకొట్టకముందే బయటకు పరిగెత్తాడు.
టీచర్; ఏంటిరా రాము గంట కొట్టకనే వెళ్తున్నావేంటి.
రాము: మీరే కదా! "ఆలస్యం అమృతం విషం" అన్నారు.
ఒక ఆమె తన కుక్క కనిపించలేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది.
పోలీస్: మీ కుక్క ఆనవాళ్ళు మీకు తెలుసా? అని అడిగాడు.
ఆమె: తెలుసండీ.
పోలీస్: ఏమిటవి?
ఆమె: మా కుక్క అరిస్తే మా అత్తగారు అరిచినట్లు ఉంటుంది అని అన్నది.
భూపాల్: ఏమండీ! ఈ అడవిలో స్మగ్లర్ వీరప్పన్ గారు అని ఒకాయన ఉన్నారట. ఆయన్ను కలుసుకునేందుకు మార్గం చెప్పండి.
ముని: ఆయన కోసమే నేను ఇంతలా గెడ్డం పెంచుకొని తపస్సు చేస్తున్నా. ఆయన దొరికితే నేను కిడ్నాప్ చేయించుకోవాలి.
సేకరణ: కె.శ్రీనివాసులు, జాబిల్లి బాలల సంఘం, హరియాన్ చెర్వు.
ఒక రాత్రి కరెంటు పోయింది. భార్య కొవ్వొత్తి అంటించింది.
భర్త: ఏమే, ఫ్యాన్ వెయ్యి, ఉడుకు పుడుతోంది.
భార్య: ఏమండీ ఫ్యాన్ వేస్తే కొవ్వొత్తి ఆరిపోతుంది.