సేకరణ: యస్. కల్పన, 9దవ తరగతి, ప్రకృతి బడి.
1. కొండ కింద గుండు
జవాబు: కొప్పు
2. పచ్చని చెట్టు కింద ఎర్రని పెళ్ళి కొడుకు
జవాబు: పండు మిరపకాయ
3. మీ తాతా బోడేడే, మా తాతా బోడేడే
సిద్దయ్య బోడేడే, శివలింగం బోడేడే
జవాబు: కాళ్ళ మంచం
4. కాళ్ళు లేని పిల్లవాడు కొండ ఎక్కాడు. ఏంటది?
జవాబు: పాము
5. కాళ్ళు లేని పిల్లవాడు గాలిలోకి ఎగిరినాడు. ఏంటది?
జవాబు: గాలిపటం
6. ప్రశ్నిస్తుంది, బెదిరిస్తుంది, గౌరవిస్తుంది- ఏమిటది?
జవాబు: క్యా?-బే!-జీ!!
సేకరణ: పి. హర్ష వర్ధన్ రెడ్డి, 3వ తరగతి, టింబక్టు బడి.
1.గుంపు గుంపు చెట్లలో ఎర్రని పెళ్ళి కూతురు
జవాబు: టమోట
-
గుంపు గుంపు చెట్లలో నల్లని భార్య
జవాబు: పేను