పిల్లలము పసి పిల్లలము
చల్లని తెల్లని మల్లెలము
జాబిలి తెచ్చిన వెన్నెలము
జాతి పతాకపు రంగులము
అల్లరి అన్నది మే మెరుగం
ఆట పాటలలో ముందుంటాం
అమ్మ నాన్నల ఆశలు తీర్చగా
చదువులు చక్కగా చదివేస్తాం
పాఠశాల పరిశుభ్రం చేస్తాం
పచ్చని మొక్కలు పెంచేస్తాం
గురువుకు దండం పెడతాం
చదువుకు గులాములవుతాం
పిల్లలము పసి పిల్లలము
చల్లని తెల్లని మల్లెలము

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song