తండ్రి: ఏరా, రాజేష్! నీకు ఎప్పుడూ సున్నా మార్కులే వస్తుంటాయి?
రాజేష్: మరి నేనేమి చెయ్యాలి నాన్నా! మా తరగతిలో 1 నుండి 100 వరకు అంకెల్ని అందరూ పంచుకుంటారు. చివరకు నాకు మిగిలేది సున్న ఒక్కటే!
(సేకరణ: యు. రేణుక, 8 వ తరగతి, ప్రకృతి బడి.)
ఏనుగు తొండం!
ప్రశ్న: ఏనుగు తొండాన్ని రోడ్డుకు అడ్డంగా ఎందుకు పరిచింది?
జవాబు:పరుగెత్తే చీమలు దాన్ని తొక్కి బొక్కబోర్లా పడాలని!
సగం పిల్లి!
ప్రశ్న:సరిగ్గా సగం పిల్లిలాగా ఉండేదేంటి?
జవాబు: మిగతా సగం పిల్లి.
చాలా దూరం!
టీచరు: భూమికి, చంద్రుడికి మధ్య దూరం కొలవాలంటే ఎన్ని దారపు ఉండలు కావాలి?
విద్యార్థి: పూర్తి పొడవు ఉండేది- ఒక్కటి చాలు.
జైలు యోగం!
టీచరు: “నేనొక వ్యక్తిని చంపాను" - భవిష్యత్ కాలంలోకి మార్చి చెప్పరా!
విద్యార్థి: “మీరు జైలుకు పోతారు" సర్!
ఉపాయం!
కొడుకు: నాన్నా! నా ప్రోగ్రెస్ కార్డు మీద నువ్వెప్పుడూ సంతకం చెయ్యవెందుకు? వేలిముద్రే ఎందుకు వేస్తావు?
తండ్రి: ఏం లేదురా! నీ అంత బాగా చదివే కొడుకును కన్నవాళ్లకు 'చదువురాదు' అని మీ టీచరు అనుకొని, అలాగైనా నిన్ను కొట్టకుండా వదిలేస్తుందని!
గొప్ప అర్థం!
టీచరు: “తమసో మా జ్యోతిర్గమయ” అంటే ఏంటో చెప్పరా, రణబీర్?
రణబీర్: నేను హిందీలో చెబుతాను టీచర్!
టీచరు: సరే, చెప్పు!
రణబీర్: तुम सॊऒ मा, मै ज्यॊती कॆ पास् जाता हू|
అయస్కాంతత్వం!
ప్రశ్న: ఒక అయస్కాంతం ఇంకో అయస్కాంతంతో ఏమంటుంది?
జవాబు: “నీలో చాలా ఆకర్షణ శక్తి ఉంది"
గజ చర్మం!
ప్రశ్న: ఏనుగు చర్మం ముడతలు పడి ఉంటుంది ఎందుకు?
జవాబు: ఎవ్వరూ దాన్ని ఇస్త్రీ చెయ్యరు కదా, అందుకని!
శకునం
ప్రశ్న: ఏ సమయంలో పిల్లిని చూడకూడదు?
జవాబు: నువ్వు ఎలుకవైనప్పుడు.
రెండు రోజుల తర్వాత!
ప్రశ్న: గొంగళి పురుగుకు రెండు రోజుల వయసు వచ్చాక ఏమౌతుంది?
జవాబు: మూడు రోజులది అవుతుంది.