సాకి:
అణగారిన బ్రతుకులను వెలిగించిన వాడా నవ భారత రాజ్యాంగము నిర్మించిన వాడా అందుకో అంబేద్కరా - దళిత ప్రజా వందనం

అందుకో దండాలు బాబా అంబేద్కరా
అంబరాన ఉన్నట్టి చుక్కలు పొడవంగ
ముందుగా నినుతలచి పాటలు పాడేము
చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగ
"అందుకో"

నీతల్లి - భీమబాయి
నీ తండ్రి - రాం జీ
నీ ఊరు - అంబవాడ
నీ జిల్లా - రత్నగిరి
ఏప్రిల్ 14 పుట్టిన రోజంట -
దళిత జాతి పీడితులకు పండుగ రోజంట
“అందుకో"

అంటరాని - వాడంటు
అగ్రజాతి - మూర్ఖులంతా
అడుగడున – నినుబడిలో
అవమానం - చేసినప్పుడు
అంటరాని తనమును పాటించిన వాళ్ళకు-
తగిన శాస్త్రి చేస్తానని శపథం చేశావు
"అందుకో"

పట్టుదలగా - ప్రాపంచపు
పెద్ద చదువు - లన్ని చదివి
రంకు నేర్పు - గ్రంధాల
రంకంతా - బయటపెట్టి
కులగజ్జి – మూర్ఖులతో
ఎనలేని - పోరుచేసి
పీడితులకు తాడితులకు హక్కులు సాధించి-
హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావు
"అందుకో "

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song