వసంతకాలం వచ్చింది
గానం: A.S. నందన, 3 వత, యు. సుమిత్ర, 4 వ త, టింబక్టు బడి.
వసంత కాలం వచ్చింది పసందు పూవ్వులు పూసినవి 2
మల్లెలు జాజులు కొల్లలు కొల్లలు “వసంత కాలం "
కోయిల కువ్వు అని కూసింది తుమ్మెద ఝుమ్మని పాడింది
పక్షులు కిలకిల మన్నాయి లేళ్ళు చెంగున ఆడినవి “ వసంత కాలం "
తోటలు పచ్చగ విరిసినవి మత్తుగ పగళ్ళు వెలిగినవి
రాతిరి వెన్నెల నవ్వింది పాటల లోకం నిండినది “ వసంత కాలం"
రోజా పువ్వు
గానం : సి. హరిత, మూడవ తరగతి, టింబక్టు బడి.
రోజా పువ్వు పూసింది
కమ్మటి వాసన వచ్చింది
దాని పక్కన ముల్లుంది
అమ్మో బాబోయ్ గుచ్చుకుంది
బంతి పాట
గానం : పి. హర్ష వర్ధన్ రెడ్డి, రెండవ తరగతి, టింబక్టు బడి.
బంతి బంతి అది నా బంతి
కాళ్ళు లేవు చేతులు లేవు
పొట్ట నిండా గాలి
ఎగురుతుంది దుంకుతుంది బంతి
అక్కయ్యక్కయ్య
గానం: రజని, 4వ తరగతి, టింబక్టు బడి.
అక్కయ్యక్కయ్య-శాంతక్కయ్య
బావేడి?-మద్రాస్ పోయినాడు
ఏంతెచ్చాడు?-పప్పులు తెచ్చాడు
పప్పులేవి? -గుడ్డోడు తిన్నాడు
గుడ్డోడేడి? -పొయ్యిలో పడ్డాడు
ఏంకాలింది? -మీసంకాలింది.
జగ్ జగ్గి జాలాకు
గానం: సుధ, 5వ తరగతి, టింబక్టు బడి.
జగ్ జగ్గిజాలాకు- ఏంపేరుపెడదాము?
చింతకిందకూరాకు- ఏంపేరుపెడదాము?
వీణానిపెడదాము - యా వూరికి ఇద్దాము?
యావూరికియిద్దాము? -రాచూరికి యిద్దాము
రాకుండా పోకుండా రాయడ్డు పెడదాము
కోడెట్లాకూసేది-కొక్కొరక్కో!
క్రికెట్
గానం: పవన్, 4వ తరగతి, టింబక్టు బడి.
ఏమిఏమిఆటమ్మా?
క్రికెట్ క్రికెట్ ఆటమ్మా
సచిన్ వచ్చె చారే కొట్టె
సౌరవ్వొచ్చె సిక్సర్ కొట్టె
ఆజార్ వచ్చె ఔటాయె
కరెంట్ పోయె ఖతం ఆయె!
కాకీ,కాకీ
గానం: కల్పన, 1 వ తరగతి, విజ్డం స్కూలు, గుడిపాల, చిత్తూరు జిల్లా.
కాకీ,కాకీ, గువ్వలకాకీ!
మాచేనులో వాలొద్దు-
మల్లెపూలు తెంచొద్దు-
మానాన్నేమొ బీదోడు ;
మాయమ్మేమొ రాకాసి;
నేనేమొ పుట్ట గోసి!
బిస్కెట్లు
గానం : ధనుశ్రీ, నందకుమార్, విజ్డం స్కూలు, గుడిపాల, చిత్తూరు జిల్లా.
బిస్కెట్లమ్మా బిస్కెట్లు
గోడమీద బిస్కెట్లు
డబ్బా నిండా బిస్కెట్లు
మూడు బిస్కెట్లు తిన్నాను
అమ్మకు కోపం వచ్చింది
మూడు గుద్దులు గుద్దింది.