భాషలన్ని వేరైనా భావమొక్కటే మతాలన్ని వేరైనా మనుషులొక్కటే తత్వాలు వేరైనా ధర్మమొక్కటే రాష్ట్రాలు వేరైనా రాజ్యమొక్కటే నదులతో గిరులతో నిండియున్నది పాపాలు కడిగేటి పుణ్యభూమిది ధర్మాధర్మాలన్ని తెలిసిఉన్నవి నీదేశ ఖ్యాతిని నిలుపు సోదరా "భాషలన్ని" ఈసీమలాసీమ లెన్ని వెలసినా తీరైన మా తల్లి దేశమొక్కటే వేషాలు భేదాలు వేరు తోచినా వారూ వీరంతానూ భారతీయులే "భాషలన్ని"