రచన: ఆచార్య యం.కె.దేవకి, చైర్మన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్, తెలుగు తులనాత్మక సాహిత్యశాఖ, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం.
స్వరకల్పన: బి. మోహనయ్య, ఉపాధ్యాయులు, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
గానం: యు.రేణుక(8వ త.), యం.రోజ(9వ త.), ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
డప్పు: పి.పోతులయ్య(8వ త.), ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
చుక్కల రాణులు చక్కనివారు
మక్కువ తోటి వస్తుంటారు
మనసు దోచే మణులుర వారు
మంద మందలుగ ఉంటారు
తారలు వారు తక్కువ కారు
తీరు తీరులుగ ఉంటారు
నింగిని మెరిసే తళుకు బెళుకులు
నంగి నంగిగా వస్తారు
చిన్నా చితక పెద్దాపరక
చెకుముకి రాళ్ళుర వారు
కన్నుగీటి కవ్వించేటి
కలువ భామలుర వారు
నక్షత్రాలు ఇరవయ్యేడు
నాణ్యముగా కనిపిస్తారు
చంద్రుని చుట్టు ఉండేవారు
చుక్కల భామలు వారు
ఎక్కడెక్కడో ఉంటారు
నిక్కి నిక్కి చూస్తుంటారు
తెల్లవారగనే వెల వెల బోతూ
వెళ్ళిపోతారు వారు
చుక్కల రాణులు చక్కనివారు
మక్కువ తోటి వస్తుంటారు
మనసు దోచే మణులుర వారు
మంద మందలుగ ఉంటారు