దళితవాడలో పుట్టావయ్యా - పేదరికంలో పెరిగావయ్యా బడిలో చివరన చేరావయ్యా - గుడికి దూరంగా నిలిచావయ్యా |దళిత| కులతత్వపు ఈ అడ్డు గీతలు - కోటి ప్రశ్నలే లేవనెత్తగా ఎటు చూసినా అజ్ఞానం - చుట్టూరా అంధకారం |దళిత| బాధలూ ఈసడింపులూ - బానిస బతుకుల విముక్తి కోసం దేశాలెన్నో తిరిగీ తిరిగీ - శాస్త్రాలెన్నో చదివీ చదివీ |దళిత| మానవత్వపు విలువలు పెంచి - మతతత్వానికి హద్దులు చెరిపి నీవు కూర్చిన రాజ్యాంగం - జాతి జనులకు కరదీపం |దళిత|