నరసింహారెడ్డి అడుగుతున్న పొడుపు కథలు:

  1. కీస్ కీస్ పిట్ట - నేల కేసి కొట్ట.

  2. కొండమీద గోంగూర తోట - ఎంత కోసినా తరగదు.

  3.    పేపర్లు చింపుతాడు కాని పిల్లవాడు కాదు.
       డబ్బులు అడుగుతాడు కానీ బిక్షగాడు కాదు.
       విజిల్ వేస్తాడు కాని పోలీసు కాదు.
       ఎవరు వాడు?
       
    తిరుపాలు అడుగుతున్న పొడుపుకథలు:

  4.    తల లేదు  మొల లేదు
       తా ధరణిలో నుండు
       వెలయు చేతులుండు
       వేళ్ళు లేవు
       ఎవరది?      

  5.    ముద్దు ముద్దుగా వచ్చు
       ముక్కు పై కెక్కు
       చెవులు పట్టి లాగు
       చెంప నొక్కు
       దండి పండితులకు
       దారి చూపుట వృత్తి
       ఎవరది?
       

  6.    దిబ్బెక్కి చూసేవి రెండు
       దిబ దిబలాడేవి రెండు
       ఆలకించేవి రెండు
       అందుకొనేవి రెండు
       ఏమిటవి?
       

జవాబులు:

  1. చీమిడి
  2. వెంట్రుకలు
  3. కండక్టరు
  4. చొక్కా
  5. కళ్ళజోడు
  6. కళ్ళు, కాళ్ళు, చెవులు, చేతులు.