భారతమాతకు జయం అంటూ చాలా పాటలే రాశారు కవులు. ఈ పాటలో భరతమాతతో పాటు తెలుగు తల్లీ కలిసింది. ఎలా ఉందో విని చెప్పండి:
గానం: అనిత బృందం, తొమ్మిదవ తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
డప్పు: సతీష్
జయహే భరతమాత జయహే
జయహే తెలుగుతల్లి జయహే
గంగ యమున ఘన గోదావరి జన జీవనదుల తల్లీ
పాడి పంటలకు పసిడి సీమగా పేరు గాంచెనమ్మా
|జయహే|
సిరులకు కళలకు నిలయమైన బంగారు తల్లివమ్మా
నీ కీర్తికాంతి ఈ చరితలో వెదజల్లవె మాతల్లీ
|జయహే|
వీరులెందరికొ జన్మనిచ్చిన వీరమాతవమ్మా
కవులు గాయకులు చిత్రకారులకు కన్నతల్లివమ్మా
|జయహే|