చీమా చీమా వస్తావా
చీమా! చీమా!వస్తావా?
గానం:
అడిగినవారు: ఆర్. శిరీష, మూడవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్త పల్లి.
చెప్పినవారు: వి. రాజు, ఐదవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.
డప్పు: పోతులయ్య, ఏడవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.
చీమా! చీమా! వస్తావా?
సినిమా కెళ్దాం వస్తావా?
పరీక్షలయ్యా బాలయ్యా!
బాగా చదువుకోవయ్యా!
పిచుకా! పిచుకా! వస్తావా?
పిక్చరు కెళ్దాం వస్తావా?
పరీక్షలమ్మా పాపమ్మా!
బాగా చదువుకోవమ్మా!
చిలకా! చిలకా! వస్తావా?
షికారు కెళ్దాం వస్తావా?
పరీక్షలండ్రా బాలల్లూ!
బాగా చదువుకోండర్రా!
వ్యాఖ్యలు వారి సౌజన్యంతో