జామచెట్టు జామచెట్టు బాగున్నావా! జామ చెట్టు కొమ్మ నుండి జారి పడ్డానా! భయం లేదు భక్తి లేదు బాయిలో పడితే లోతు లేదు. ఈత కొమ్మ చాటు లేదు మిరపకాయ ఘాటు లేదు కారం శెనగలు కటకటా అత్త పాణం మిటమిటా!
ఆరేడేళ్ల పిల్లలు పాడుకునే పాటల్లో శబ్దాలు బాగుంటాయి. అలాంటిదో పాట:
గానం: సి. పవన్, రెండవ తరగతి, టింబక్టు బడి, చెన్నేకొత్త పల్లి, అనంతపురం జిల్లా.
డప్పు: టి. నాగార్జున, ఏడవ తరగతి, టింబక్టుబడి.
సౌజన్యం: సాధన ప్రింటర్స్ వారి ’పిల్లల పాటలు’ పుస్తకం.
జామచెట్టు జామచెట్టు బాగున్నావా! జామ చెట్టు కొమ్మ నుండి జారి పడ్డానా! భయం లేదు భక్తి లేదు బాయిలో పడితే లోతు లేదు. ఈత కొమ్మ చాటు లేదు మిరపకాయ ఘాటు లేదు కారం శెనగలు కటకటా అత్త పాణం మిటమిటా!
పవన్ చక్కగా పాడావు.
వ్రాసిన వారు: రమ్య — March 6, 2009